రష్మిక మందన్న కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్
కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు.
BY Vamshi Kotas26 Jan 2025 12:17 PM IST
X
Vamshi Kotas Updated On: 26 Jan 2025 12:17 PM IST
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. 2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నా ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నాపై మీరు చూపించే లవ్, అభిమానం వల్ల నాకు ఈనొప్పి తెలియడం లేదు అని నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా అని తెలిపింది.
ఇక రష్మిక పోస్ట్ చూసిన ఫ్యాన్స్ రష్మిక మందన్న ఆ గాయం నుండి త్వరగా కోలుకొని సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ఇక రష్మిక మందన్న రీసెంట్ గా తన నెక్స్ట్ సినిమా కోసం జిమ్ లో తెగ కష్టపడుతూ కనిపించింది. అయితే ఆ టైంలోనే తన కాలికి గాయమై బెణికినట్టు తెలిపింది. కాలికి కట్టుతో కనిపించి జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో గాయం అయిందని కొద్ది రోజులు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారని చెప్పింది.
Next Story