Rashmika | మరో పవర్ ఫుల్ పాత్రలో రష్మిక
Rashmika - యానిమల్ లో బలమైన పాత్ర పోషించింది రష్మిక. ఇప్పుడు మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. అదే సికిందర్ మూవీ.

రష్మిక తన కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో అగ్రస్థానంలో ఉంది. పాత్రల ఎంపిక, హీరోల సెలక్షన్ లాంటివి ఆమెను టాప్ పొజిషన్ లో నిలబెట్టాయి. అందుకే ఆమెను కేవలం గ్లామరస్ హీరోయిన్ గా చూడరు ప్రేక్షకులు. అందంతో పాటు, మంచి పాత్రలతో అలరించడం రష్మిక స్పెషాలిటీ.
సల్మాన్‌ఖాన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సికిందర్ అనే పేరు పెట్టారు. మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో రష్మిక కోసం అతడు ఓ బలమైన పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది,
రష్మిక కేవలం పాటలు, డ్యాన్స్ లాంటి రొటీన్ వ్యవహారానికే పరిమితం కాకుండా.. సినిమాలో కథను ముందుకు నడిపించే పూర్తి నిడివి పాత్రలో, బలమైన ఎమోషన్స్ తో ఈ సినిమాలో కనిపించబోతోందట.
ప్రస్తుతం ఆమె పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆ సినిమా కొలిక్కి వచ్చిన వెంటనే సికిందర్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 సినిమాలతో కెరీర్ లో మరింత ముందుకెళ్లాలని ఆమె భావిస్తోంది.