Rashmika | విజయ్ లో నాకు నచ్చని అంశం అదే
Rashmika - తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండపై మరోసారి స్పందించింది రష్మిక. అతడిలో ఉన్న చెడు లక్షణాల్ని బయటపెట్టింది.
BY Telugu Global4 April 2024 4:58 PM
X
Telugu Global Updated On: 4 April 2024 4:58 PM
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ప్రేమించుకుంటున్నారంటూ చాన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఆమధ్య వీళ్ల పెళ్లిపై కూడా పుకార్లు వచ్చాయి. ఈ జంట మాత్రం వాటిని ఖండించలేదు, అలా అని సమర్థించనూ లేదు. తమ పనిలో తాము మునిగిపోయారు. టైమ్ దొరికినప్పుడల్లా కలుస్తున్నారు.
తాజాగా మరోసారి విజయ్ దేవరకొండపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది రష్మిక. ఓ బాలీవుడ్ టాక్ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ.. విజయ్ దేవరకొండ, తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చామని, అందుకే తమ అభిప్రాయాలు, ఆలోచనలు తొందరగా కలిశాయని చెప్పుకొచ్చింది.
ఇక విజయ్ దేవరకొండ నిత్యం ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడని, అది తనకు నచ్చదని తెలిపింది. దీంతో పాటు ఎప్పుడు చూసినా చాలా సీరియస్ గా ఉంటాడని, పని గురించి తప్ప మరో విషయం మాట్లాడడని కూడా కంప్లయింట్ చేస్తోంది. విజయ్ లో తనకు ఈ రెండు అంశాలు నచ్చవని అంటోంది.
Next Story