Telugu Global
Cinema & Entertainment

Ramcharan | గేమ్ ఛేంజర్ కోసం దేవరలో మార్పు

Game Changer - చరణ్ సినిమాకు ఇంకా విడుదల తేదీ ఫిక్స్ చేయలేదు. ఇప్పుడా టైమ్ వచ్చింది. దేవర డేట్ కోసం ప్రయత్నం.

Ramcharan | గేమ్ ఛేంజర్ కోసం దేవరలో మార్పు
X

టాలీవుడ్ లో విడుదల తేదీలు మారడం కొత్తేంకాదు. ముందువెనక ఆలోచించకుండా ఓ తేదీ చెప్పడం, ఆ తర్వాత ఆ తేదీ నుంచి వాయిదా బాట పడడం చాలా కామన్ అయిపోయింది. చెప్పిన తేదీకి వచ్చిన పెద్ద సినిమాల్ని టాలీవుడ్ లో వేళ్లపై లెక్కబెట్టొచ్చు. ఈ క్రమంలో మరో 2 సినిమాల విడుదల తేదీల్లో మార్పుచేర్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్-2, ఓజీ విడుదలైన 2 వారాల గ్యాప్ తర్వాత అక్టోబర్ 10న థియేటర్లలోకి వస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఇప్పుడీ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మారేలా ఉన్నాయి.

ఓజీ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. ఆ తేదీకి దేవర పార్ట్-1 వచ్చే అవకాశం ఉంది. ఇక దేవర ఇన్నాళ్లూ లాక్ చేసిన అక్టోబర్ 10 తేదీకి చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 3 సినిమా నిర్మాతల మధ్య చర్చలు సాగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. దేవర పార్ట్-1ను అనుకున్న తేదీ కంటే 2 వారాల ముందు విడుదల చేయడానికి ఎన్టీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెబుతున్నారు. తారక్-చరణ్ మధ్య అండర్ స్టాండింగ్ తోనే ఇది సాధ్యమైందని చెబుతున్నారు చాలామంది.

First Published:  13 May 2024 2:50 PM IST
Next Story