Game Changer | గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్ డేట్స్
Game Changer Movie - రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మరోసారి సెట్స్ పైకి రాబోతోంది. రేపట్నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

Ram Charan's Game Changer: 12 వందల మందితో ఒక్కడు
దాదాపు ఏడాదిన్నరగా సాగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ మరోసారి మొదలుకాబోతోంది. రేపు ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో, 10 రోజుల పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు.
తన కుమార్తె పెళ్లి పనుల్లో ఈమధ్య కాస్త బిజీ అయ్యారు దర్శకుడు శంకర్. పెద్ద కుమార్తె ఎంగేజ్ మెంట్ తాజాగా పూర్తయింది. దీంతో వెంటనే ఆయన గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి రాబోతున్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. అయితే సినిమా విడుదల తేదీని మాత్రం ఆయన ఇప్పటివరకు ప్రకటించలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాతే విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. లెక్క ప్రకారం ఈ దసరాకు గేమ్ ఛేంజర్ అనుకున్నారు.
కానీ ఆల్రెడీ దసరా బరిలో దేవర నిలిచింది. దీంతో గేమ్ ఛేంజర్ ఆ టైమ్ కు రాదనే విషయం స్పష్టమైంది. తాజా షెడ్యూల్ పూర్తయిన తర్వాత విడుదల తేదీ వెల్లడిస్తారేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే.