Game Changer - గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్
Game Changer - రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. చరణ్ ఫస్ట్ లుక్ రిలీజైంది.

Ram Charan's Game Changer: 12 వందల మందితో ఒక్కడు
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి `గేమ్ చేంజర్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఈరోజు ఉదయం బయటపెట్టారు. ఇక సాయంత్రం గేమ్ ఛేంజర్ సినిమా నుంచి చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భగా గేమ్ చేంజర్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా పవర్‌స్టార్ రామ్ చణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కు తగ్గట్టు, పవర్ ఫుల్ టైటిల్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ ఖరారు చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో బైక్ పై కూర్చుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టైలిష్ లుక్ లో చరణ్ ఉన్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో ఊపుమీదున్న చరణ్, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ చేయాలని చూస్తున్నాడు. అవసరమైతే మరోసారి హాలీవుడ్ రేంజ్ కు వెళ్లాలనేది అతడి ప్లాన్. అందుకే ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.