Ramcharan - సంక్రాంతి డేట్ ఫిక్స్ చేసిన చరణ్
Ramcharan Shankar Movie - సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇప్పుడు తాజాగా తేదీ కూడా లాక్ చేశారు.

శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దిల్ రాజు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ఇంతకుముందే ప్రకటించారు దిల్ రాజు. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.
సంక్రాంతి బరిలో వచ్చే ఏడాది జనవరి 10న రామ్ చరణ్, శంకర్ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే రిలీజ్ డేట్ తో ఓ పోస్టర్ ను విడుదలచేయాలనుకుంటున్నారు.
నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ రాలేదు. టైటిల్ కూడా ఎనౌన్స్ చేయలేదు. ఈ రెండింటిని పక్కనపెట్టి, అర్జెంట్ గా రిలీజ్ డేట్ ప్రకటించాలని దిల్ రాజు భావిస్తున్నాడు. సంక్రాంతికి మరిన్ని సినిమాలు రెడీ అవుతున్న నేపథ్యంలో, కాస్త ముందుగానే విడుదల తేదీ ప్రకటించి వివాదాలు తలెత్తకుండా చూడాలనుకుంటున్నాడు దిల్ రాజు.
సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-కె ఉంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు చరణ్ సినిమాతో పొంగల్ వేడి మరింత పెరిగింది.