Ram Charan: మరోసారి అమెరికాకు పయనమైన రామ్ చరణ్
Ram Charan leaves for the US again: రామ్ చరణ్ మరోసారి అమెరికా కు పయనమయ్యాడు. ఈ సారి ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొంటాడు చరణ్.
BY Telugu Global20 Feb 2023 11:34 PM IST

X
Telugu Global Updated On: 20 Feb 2023 11:42 PM IST
రామ్ చరణ్ ఇటీవల ఆస్కార్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాడు. తిరిగి వచ్చాక దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా పాటల చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ రోజు చరణ్ మరోసారి యునైటెడ్ స్టేట్స్ కు తిరిగి వెళ్లాడు.
ఈసారి ఎక్కువ కాలం అమెరికాలోనే ఉంటాడు చరణ్. వచ్చే నెల జరిగే ఆస్కార్ వేడుకలకు కూడా హాజరుకానున్నాడు.
“RRR”తో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందాడు. జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు. రామ్ చరణ్ తన గ్లోబల్ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు ఇలా టూర్ ప్లాన్ చేశాడు.
ఈ వేసవిలో రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సినిమాను ప్రారంభించనున్నారు. మరో 2 సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయి.
Next Story