Ram Charan: సల్మాన్-వెంకటేష్ తో చరణ్ డాన్స్
Ram Charan: సల్మాన్, వెంకీతో కలిసి డాన్స్ చేశాడు చరణ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Ram Charan - సల్మాన్-వెంకటేష్ తో చరణ్ డాన్స్
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో మెగావపర్ స్టార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తారన్నప్పటి నుంచీ అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. పాటను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆ అంచనాలన్నింటినీ ఒక్క స్టెప్‌తో, ఒక్క సాంగ్‌తో బీట్ చేసేలా మన ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి డాన్స్ చేసిన ఈ పాట అభిమానులను, ప్రేక్షకులను ఊర్రుతలూగించింది. ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన తీరు, ఆయన ఎనర్జీ పాటకు మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.
మెరిసిపోయేలా పసుపు చొక్కా, తెలుపు లుంగీలో రామ్ చరణ్ స్టైలిష్ ఎంట్రీ, ఆయన రియల్ లైఫ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ వెంకీలతో వేసిన డాన్స్ వావ్ అనిపిస్తోంది. రామ్‌చరణ్-సల్మాన్-వెంకీ కలిసి వేసిన స్టెప్పులు చూడ్డానికి బాగున్నాయి.
ఈద్‌కి విడుదల కానుంది కిసి కా భాయ్ కిసీ కీ జాన్. పాయల్ దేవ్ స్వరపరచిన ఏంటమ్మా పాట తప్పకుండా భాయ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అవుతుంది. వెంకీ, పూజాహెగ్డే ఉండడంతో, టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు.