Telugu Global
Cinema & Entertainment

Double Ismart | డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్ డేట్స్

Ram Pothineni Double Ismart - రీసెంట్ గా స్టార్ట్ అయింది డబుల్ ఇస్మార్ట్ షూటింగ్. అంతలోనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.

Double Ismart | డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్ డేట్స్
X

హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్ టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ ముంబయిలో మొదలైంది. ఇప్పుడా ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా, అతి త్వరలో సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.

రామ్‌ తో పాటు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా తొలి షెడ్యూల్‌ లో పాల్గొన్నాడు. ఈమధ్య అతడి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్, పూరీ డెడ్లీ కాంబినేషన్‌ లో బ్లాక్‌బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్‌ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డబుల్ ఇస్మార్ట్ కోసం పాన్ ఇండియా లెవెల్ కథ రాసుకున్నాడట పూరి జగన్నాధ్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు రామ్. డబుల్ ఇస్మార్ట్ లో స్టైలిష్ బెస్ట్ లుక్ లో కనిపించబోతున్నాడు. డబుల్ ఇస్మార్ట్ మూవీని, వచ్చే ఏడాది మార్చి 8న మహాశివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. రామ్ కెరీర్ లో ప్రాపర్ పాన్ ఇండియా సినిమా ఇదే. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఆగస్ట్ లో వెల్లడిస్తారు.

ఓవైపు స్కంద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు రామ్. ఆ సినిమాకు డబ్బింగ్ చెబుతూనే, మరోవైపు డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సెప్టెంబర్ చివరి నాటికి డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ను పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  31 July 2023 12:28 PM
Next Story