Telugu Global
Cinema & Entertainment

Double Ismart | రామ్ సినిమా టీజర్ రెడీ

Double Ismart Teaser - రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తోంది డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా టీజర్ రెడీ అయింది.

Double Ismart | రామ్ సినిమా టీజర్ రెడీ
X

డబుల్ ఇంపాక్ట్ తో ఇస్మార్ట్ హంగామా క్రియేట్ చేసే సమయం ఆసన్నమైంది. పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' నుండి దిమాకికిరికిరి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు

టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్‌ని ఫేస్ మాస్క్‌తో సీరియస్ గా కనిపించాడు. పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి, ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని ఉన్నాడు. పూరి మార్క్ ఇంటెన్స్ లుక్ ఇది.

ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది, ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొంటుంది. త్వర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నందున, బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో ముందుకు రానున్నారు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేకోవర్ అయ్యారు. డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.

First Published:  12 May 2024 5:46 PM
Next Story