Telugu Global
Cinema & Entertainment

Ram Gopal Varma: దిగజారి పోయాడు అని రామ్ గోపాల్ వర్మ పై మండిపడుతున్న అభిమానులు

Ram Gopal Varma: తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వర్మ. బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి హోస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ అషూ కాలు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. సినిమా పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ ఇంకా ఎంత దిగజారిపోతారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆర్జీవి పై దుమ్మెత్తి పోస్తున్నారు.

దిగజారి పోయాడు అని రామ్ గోపాల్ వర్మ పై మండిపడుతున్న అభిమానులు
X

దిగజారి పోయాడు అని రామ్ గోపాల్ వర్మ పై మండిపడుతున్న అభిమానులు

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఒక బ్రాండ్. నాగార్జున హీరోగా నటించిన "శివ" వంటి కల్ట్ క్లాసిక్ తీసిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత కూడా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తన కరియర్ లో ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్లు, ఒక నేషనల్ అవార్డు కూడా అందుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం కనిపించకుండా పోయారని చెప్పుకోవాలి.

గత కొంత కాలంగా రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడం లేదు. తాజాగా ఇప్పుడు రాంగోపాల్ వర్మ "మా ఇష్టం డేంజరస్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇది లెస్బియన్ ల కథ. డిసెంబర్ 9న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ తో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బిజీగా ఉన్నారు.

తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వర్మ. బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి హోస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ అషూ కాలు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. సినిమా పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మ ఇంకా ఎంత దిగజారిపోతారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆర్జీవి పై దుమ్మెత్తి పోస్తున్నారు.

కేవలం ఒక్క సినిమా కోసం రాంగోపాల్ వర్మ మరి ఇంత దిగజారిపోయి కెమెరా ముందు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని మండిపడుతున్నారు. ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు లేరని ఇలాంటి పనులు చేస్తూ కూర్చుంటే ఇక ఆర్జీవి ఎప్పటికీ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోలేరని అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు.

First Published:  9 Dec 2022 6:19 PM IST
Next Story