Rakul Preeth | రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రెడీ?
Rakul Preeth - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందట. ఈ మేరకు బాలీవుడ్ నుంచి వరుస కథనాలు వెలువడుతున్నాయి.

Rakul Preet Singh: నా పెళ్లి ఎలా జరిగిందో చెప్పండి
సౌత్ పాపులర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతోందా? కొత్త ఏడాదిలో ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుందా? మరో నెల రోజుల్లో రకుల్ మెడలో మూడు ముళ్లు పడబోతున్నాయా? అవుననే అంటోంది బాలీవుడ్ మీడియా
ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థలన్నీ రకుల్ వివాహాన్ని నిర్థారిస్తున్నాయి. ఫిబ్రవరి 22న మె వివావహం జరుగుతుందని, డెస్టినేషన్ వెడ్డింగ్ కు భిన్నంగా, గోవాలో రకుల్ పెళ్లి చేసుకుంటుందని బాలీవుడ్ మీడియా సంస్థల నుంచి కథనాలు వస్తున్నాయి.
2022 అక్టోబర్ లో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది రకుల్. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అప్పట్నుంచి ప్రేమించుకుంటున్న ఈ యువ జంట, ఈ కొత్త సంవత్సరంలో పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకుంటోంది.
రకుల్ కు సౌత్ లో క్రేజ్ తగ్గింది. ప్రస్తుతం ఆమె ఇండియన్-2, అయలాన్ సినిమాల్లో నటిస్తోంది. ఇండియన్-2లో ఆమెది హీరోయిన్ రోల్ కాదు. అటు బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటోంది.