షూటింగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ భర్తకి గాయాలు
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానీకి గాయాలయ్యాయి.
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నిర్మాత రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీకి షూటింగ్‌లో ప్రమాదం జరిగింది.‘మేరే హస్బెండ్‌కి బీవీ’ సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదంలో వీరిద్దరూ గాయపడ్డారు. ఈ మూవీని రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. షూటింగ్‌లో సెట్ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అర్జున్ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీకి గాయలు అయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు తివారీ స్పందిస్తూ షూటింగ్‌లో సెట్ పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.‘‘షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సెట్ పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయ్యిందని.. అదృష్టవశాత్తూ, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని తెలిపాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేసినట్లు తివారీ పేర్కొన్నారు