Telugu Global
Cinema & Entertainment

Rakul Preet | చాలా ఆత్రుతగా ఉంది

Rakul Preet Singh - లాంగ్ గ్యాప్ తర్వాత భారతీయుడు-2తో తెలుగులోకొస్తోంది రకుల్. ఈ సినిమా రిజల్ట్ పై ఆమె చాలా ఆత్రుతగా ఉంది.

Rakul Preet | చాలా ఆత్రుతగా ఉంది
X

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఈ మూవీ తెలుగు ప్రచారం కోసం తారలంతా దిగొచ్చారు. కమల్, సిద్దార్థ్, శంకర్, రకుల్.. ఇలా నటీనటులంతా హైదరాబాద్ లో వాలిపోయారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రకుల్, భారతీయడు-2ను తెరపై చూసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నట్టు తెలిపింది.

"ఇది నాకు ఒక కల. నేనెప్పుడూ ఊహించలేదు. భారతీయుడు-2లో భాగం అవుతానని కలలో కూడా ఊహించలేదు. నన్ను నమ్మిన శంకర్ కు ధన్యవాదాలు. ఇందులో చాలా మంచి రోల్ చేశాను. నా పాత్రను తెరపై చూసుకోవడానికి చాలా ఆత్రుతగా ఉన్నాను."

కమల్ హాసన్ తో నటించడంతో తన కల నెరవేరిందని, తన కెరీర్ కు ఓ సార్థకత చేకూరిందని చెప్పుకొచ్చింది రకుల్. సినిమాలో సిద్దార్ధ్ కు జోడీగా నటించిన రకుల్, తన పాత్ర చాలా బాగుంటుందని అంటోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.








First Published:  9 July 2024 3:07 AM GMT
Next Story