Telugu Global
Cinema & Entertainment

Lal Salaam | రజనీకాంత్ మూవీ టీజర్ వచ్చేసింది

Lal Salaam - రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సినిమా లాల్ సలామ్. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Lal Salaam | రజనీకాంత్ మూవీ టీజర్ వచ్చేసింది
X

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఎన్నో మ‌తాలు, కులాల వాళ్లు ఇక్క‌డ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మ‌న‌లో మ‌న‌కు గొడ‌వ‌లు పెట్టారు. దీని వ‌ల్ల న‌ష్టం జ‌రిగింది. అయితే ఇలాంటి చెడు ప‌రిమాణాల నుంచి ప్ర‌జ‌ల‌ను, దేశాల‌ను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్‌.

మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా స‌ర్దుబాటు చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త‌ను కుదిర్చార‌నేది తెలుసుకోవాలంటే ‘లాల్ స‌లామ్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాతలు. మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టించారు. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది.

దీపావ‌ళి సంద‌ర్భంగా ‘లాల్ స‌లామ్‌’ చిత్రం నుంచి టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ప్పుడు జ‌రిగిన న‌ష్టం ఏంటి? క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్ద‌రు యువ‌కులు.. వారిలో ఒక‌రు హిందు, మ‌రొక‌రు ముస్లిం. ఇద్ద‌రి మ‌న‌సుల్లో మ‌తపూరిత ద్వేషం ఉండ‌టంతో క్రికెట్ ఆట‌లో ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డే స‌న్నివేశాలు, దాని వ‌ల్ల వారిద్ద‌రూ మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డే స‌న్నివేశాల‌ను చూడొచ్చు.

హిందు, ముస్లింలు గొడ‌వ ప‌డుతున్న‌ప్పుడు.. మొయిద్దీన్ భాయ్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశార‌నే క‌థాంశంతో ‘లాల్ స‌లాం’ రూపొందింద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థమ‌వుతుంది. ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు.

First Published:  12 Nov 2023 5:01 PM GMT
Next Story