Telugu Global
Cinema & Entertainment

Lal Salaam - మరో సినిమా పూర్తిచేసిన సూపర్ స్టార్

Rajinikanth Lal Salaam - రజనీకాంత్ మరో సినిమా షూటింగ్ పూర్తిచేశారు. కూతురు దర్శకత్వంలో చేస్తున్న లాల్ సలామ్ సినిమాలో రజనీ పోర్షన్ కంప్లీట్ అయింది.

Lal Salaam - మరో సినిమా పూర్తిచేసిన సూపర్ స్టార్
X

లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తున్నారు. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. ఈ విష‌యాన్ని చిత్ర దర్శ‌కురాలు ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ‘‘మీతో సినిమా చేయటం ఓ అద్భుతం. నాన్నా.. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు... ‘లాల్ సలాం’లో మొయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’’ అని ఆమె పేర్కొన్నారు. ర‌జినీకాంత్ స‌హా ఎంటైర్ యూనిట్ క‌లిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.

లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ ను ఓ ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో చూడ‌బోతున్నారు ప్రేక్షకులు. ఐశ్వ‌ర్య రజ‌నీకాంత్‌, పెర్ ఫెక్ట్ ప్లానింగ్ తో, తక్కువ కాల్షీట్లతో రజనీకాంత్ పోర్షన్ ను పూర్తిచేశారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నడుస్తున్నాయి. ఆ సినిమా రిలీజైన వెంటనే, లాల్ సలామ్ థియేటర్లలోకి వస్తుంది. ఈ మేరకు సన్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది.

First Published:  12 July 2023 2:19 PM GMT
Next Story