Rajinikanth Remuneration | దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్‌తో చరిత్ర సృష్టించిన తలైవా
Rajinikanth Remuneration for Jailer | కాలమిస్ట్, సినిమా వార్తలు రాసే మనోబాల విజయబాలన్ ట్వీట్ చేసిన ప్రకారం చూస్తే.. జైలర్ నిర్మాత కళానిధి మారన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్ ఇచ్చారు.

Rajinikanth Remuneration for Jailer | దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్‌తో చరిత్ర సృష్టించిన తలైవా
Rajinikanth Remuneration for Jailer | తలైవా రజినీకాంత్ జైలర్‌తో జూలు విదిల్చాడు. కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ హిట్ లేని రజినీ జైలర్‌తో పాత రికార్డులన్నీ తిరగరాశాడు. ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇంకా చాలా సెంటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్నవుతున్న జైలర్ సినిమాతో ఆయన మరో రికార్డు కూడా సృష్టించాడు. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న నటుడిగా రజినీకాంత్ చరిత్ర సృష్టించాడని చెబుతున్నారు.
110 కోట్ల రెమ్యూనరేషన్.. 100 కోట్ల ప్రాఫిట్ షేర్
జైలర్ సినిమాకి గాను రజినీ తీసుకున్న పారితోషికం రూ.110 కోట్లు. కోట్లు కోట్లుగా వచ్చిపడుతున్న లాభాలతో నిర్మాతలు ఫుల్ ఖుషీ అయిపోయారు. తలైవాకు లాభాల్లో వాటా కింద మరో చెక్కు ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. ఇందులో రాసిన మొత్తం అక్షరాలా 100 కోట్లు.
కాలమిస్ట్, సినిమా వార్తలు రాసే మనోబాల విజయబాలన్ ట్వీట్ చేసిన ప్రకారం చూస్తే.. జైలర్ నిర్మాత కళానిధి మారన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్ ఇచ్చారు. చెన్నైలోని మాండవలిలో ఉన్న సిటీ యూనియన్ బ్యాంక్ పేరిట ఈ చెక్కు ఇచ్చారని వివరాలతో సహా ట్వీట్ చేశారు. సో.. విషయం కరెక్టే. రజినీ ఫ్యాన్స్ చెబుతున్నట్లు రూ.210 కోట్లతో రజినీయే దేశంలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడు కావచ్చు.