రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతా : లావణ్య
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తాజాగా ఓ ఇంటర్వ్యలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
![రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతా : లావణ్య రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతా : లావణ్య](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403164-lavanya.webp)
యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తాజాగా ఓ ఇంటర్వ్యలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్‌కు కాళ్లు పట్టుకుని సారీ చెప్పాలి అనుకుంటున్నా ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకుడదు. నా జీవితంలో నాశనం అవ్వడానికి మస్తాన్ సాయి.. అతని కుటుంబం కారణం. రాజ్ తరుణ్‌తో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని మస్తాన్ వచ్చినప్పటి నుంచే మా మధ్య గోడవలు మొదలైయ్యాయి అని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని..‘‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు.
నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలి’’ అని లావణ్య కోరారు.‘‘తనను క్షమించాలంటూ మీడియా ముఖంగా రాజ్ తరుణ్‌ను లావణ్య వేడుకుంది. తన పక్కనే ఉంటే తాను కాళ్లు పట్టుకోవాలని అనుకుంటున్నట్లు కన్నీరుమున్నరయ్యింది. తనకు మస్తాన్ సాయి ద్వారా ప్రాణహానీ ఉందని లావణ్య ఆరోపించింది. మస్తాన్ సాయి వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌ను తాను తీసుకొచ్చానని చెప్పింది. ఆ హార్డ్ డిస్క్ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. గుంటూరులో కేసు పెట్టిన సమయంలోనే తనపై 20 మంది మస్తాన్ సాయి అనుచరులు దాడి చేసినట్లు లావణ్య వెల్లడించింది.
మస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం బహిరంగంగానే.. అతని భార్య, ప్రియురాలు నగ్న వీడియోలు మాత్రమే హార్డ్ డిస్క్‌లో ఉన్నాయంటున్నారని లావణ్య పేర్కొంది. కానీ, ఆ హార్డ్ డిస్క్‌లో 44 మంది అమ్మాయిలకు సంబంధించి 250 కి పైగా వీడియోలు ఉన్నాయని తెలిపింది. చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అమాయక యువతులు, మహిళలను లోబరుచుకుని అఘాయిత్యాలకు పాల్పడిన మస్తాన్‌సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.