ఇక 38 రోజులూ వినోదాల విందే!
పీవీఆర్- ఐనాక్స్ ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ 2, 2024 వరకు సమ్మర్ ఫిలిం ఫెస్టివల్‌ని ప్రకటించడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
పీవీఆర్- ఐనాక్స్ ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ 2, 2024 వరకు సమ్మర్ ఫిలిం ఫెస్టివల్‌ని ప్రకటించడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫెస్టివల్ 26 నగరాల్లోని 69 మల్టీప్లెక్సుల్లో అందుబాటులో కొచ్చింది. మొత్తం కలిపి 38 రోజులూ వేసవి వినోదాల విందు నందిస్తుంది. 16కి పైగా లైవ్-యాక్షన్ యానిమేషన్ మూవీస్ తో కుటుంబాలు, స్నేహితులు విభిన్న, వినోదభరిత సత్కాలక్షేపాన్ని పొందవచ్చు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి, ఉక్కోబోత నుంచీ తప్పించుకునేలా చేసే ఈ ఫెస్టివల్ వేసవి సెలవుల్లో పిల్లలకి మంచి ఆటవిడుపు.
పీవీఆర్ -ఐనాక్స్ ప్రేక్షకుల అవసరాలకి అనుగుణంగా ప్రత్యేక ఆనందానుభూతుల్ని సృష్టించడానికి అంకితభావంతో వున్నట్టు సంస్థ ప్రకటించింది. తమ సమ్మర్ ఫిలిం ఫెస్టివల్ కుటుంబాలకి, పిల్లలకి ఒక ఖచ్చితమైన సినిమా సెట్టింగ్‌లో విశ్రాంతిని, ఆనందించ గలిగే శీతల వాతావరణాన్నీ అందించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. అందరూ ఇష్టపడే సినిమాల అద్భుత ఎంపిక, ప్లేహౌస్‌లు, పిల్లలలో పిల్లల కోసం కార్యకలాపాలు, పిల్లల భోజనం, వివిధ ఆఫర్లు, బహుమతులూ వంటి వాటిని క్యూరేట్ చేసినట్టు వెల్లడించింది. ఈ పండుగని అందరికీ మరపురాని అనుభూతిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.
ఈ సమ్మర్ ఫిలిం ఫెస్టివల్, యూనివర్సల్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్, వాల్ట్ డిస్నీల సమిష్టి భాగస్వామ్యంతో అద్భుతమైన చలన చిత్రాల్ని అందజేస్తుంది. ఆధునిక క్లాసిక్స్ తో బాటు తాజా హిట్‌ల సమ్మేళనాన్ని ప్రేక్షకుల ముందుంచుతుంది. ‘ఫైండింగ్ నెమో’, ‘కోకో’, ‘ది లిటిల్ మెర్మైడ్’ వంటి ఎవర్ గ్రీన్ యానిమేషన్‌ల నుంచి ‘సూపర్ మారియో బ్రదర్స్’, ‘కుంగ్ ఫూ పాండా’ వంటి ఇటీవలి బ్లాక్‌బస్టర్‌ల వరకూ అన్ని వయసుల ప్రేక్షకులకీ అనుగుణంగా ప్రదర్శిస్తుంది. చిత్ర విచిత్ర సాహసాలు, హై-ఆక్టేన్ యాక్షన్, హృదయాల్ని కదిలించే కథలూ ... ఇలా ప్రతీ అభిరుచికి ఒక చలనచిత్రం వుండేలా జాగ్రత్తగా రూపొందించిన ఈ లైనప్ హామీ ఇస్తుంది.
ఈ సమ్మర్ ఫిలిం ఫెస్టివల్ కేవలం బ్లాక్ బస్టర్ సినిమాల ప్రదర్శనే కాదు- డ్రాయింగ్, కలరింగ్ షీట్‌ల నుంచి పజిల్స్, వర్డ్ గేమ్‌ల వరకూ వివిధ రకాల ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ సరదాగా వుండేలా చేస్తుంది. పిల్లలు సెల్ఫీలు తీసుకోవడం కూడా చేయొచ్చు. ఫెస్టివల్లో ప్రదర్శించే చలనచిత్రాల్లోని ఇష్టమైన పాత్రల ప్రసిద్ధ మస్కట్‌లని కూడా కలుసుకోవచ్చు. ఇది అదనపు ఉత్సాహాన్ని జోడిస్తుంది. ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆఫర్లు, బహుమతులు కూడా వున్నాయి. హాజరైనవారు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇంటికి మోసుకెళ్ళేలా ఈ ఫెస్టివల్ వీలు కల్పిస్తుంది.
ఈ సమ్మర్ ఫిలిం ఫెస్టివల్ ముంబాయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు మొదలైన 26 నగరాల్లో జరుగుతోంది. పీవీఆర్- ఇనాక్స్ విస్తృత మల్టీప్లెక్సుల నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆహ్లాదంగా, ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తుంది. ఈ వేసవిలో అత్యంత ఉత్తేజకరమైన ఈ చలనచిత్రోత్సవాన్ని మిస్ అవ్వకండి. ప్రదర్శన సమయాలు, టికెటింగ్ వివరాలు సహా మరింత సమాచారం కోసం, పీవీఆర్ -ఐనాక్స్ యాప్‌లు, లేదా వెబ్‌సైట్‌లు లేదా, బుక్ మై షో వంటి అగ్రిగేటర్ యాప్స్ ని సందర్శించ వచ్చు.