పుష్ప-3.. ది ర్యాంపేజ్!
పుష్ప-2 రిలీజ్ వేళ.. పుష్ప -3పై కొత్త చర్చ
పుష్ప, పుష్ప-2తోనే ఆగిపోదట.. పుష్ప-2 తర్వాత పుష్ప -3 కూడా రాబోతుందట. ఇప్పుడు సోషల్ మీడియాను ఈ చర్చ షేక్ చేస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్, రష్మికా మంధన క్రేజీ కాంబినేషన్‌లో ''పుష్ప -3 : ది ర్యాంపేజ్'' పేరుతో మరో మూవీ రాబోతుందని తెలుస్తోంది. పుష్ప సినిమాకు సౌండ్ ఇంజనీర్‌గా పని చేసిన రసూల్ పూకుట్టికి ఆస్కార్ దక్కింది. ఆయన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక పోస్టర్ పై పుష్ప-3 : ది ర్యాంపేజ్ అని ఉంది. పుష్ప పార్ట్ 3 ఉంటుందని ఇదివరకే అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 సినిమా క్లైమాక్స్‌లో పార్ట్-3 సినిమాకు సంబంధించిన లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలు చూపిస్తారని తెలుస్తోంది. కాకపోతే ఈ సినిమా ఇప్పటికిప్పుడే తెరకెక్కే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. కొంతకాలంగా పుష్ప మేకింగ్‌లోనే అల్లు అర్జున్, సుకుమార్ నిమగ్నమై ఉన్నారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత ఆ ఇద్దరూ వేరే ప్రాజెక్టుల్లో బిజీ కాబోతున్నారు. అంటే మరో రెండేళ్ల తర్వాతనే పుష్ప -3 సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.