Pushpa - 2 Movie: పుష్ప-2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్
Pushpa - 2 Movie Dialogue leaked: "మీరందరూ నన్ను పుష్ప- 2 గురించి అప్‌డేట్‌లు అడుగుతున్నారని నాకు తెలుసు. నా దగ్గర ఒక చిన్న అప్‌డేట్ ఉంది. పుష్ప- 1లో 'తగ్గేదే లే' అయితే, పుష్ప 2లో 'అసలు తగ్గేదే లే' అవుతుంది.
అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన పుష్ప- ది రైజ్ పార్ట్ 1 పాన్ ఇండియా సినిమాగా ఎంత పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుందో తెలిసిందే. పుష్ప-2, ద రూల్‌కు సంబంధించిన ఒక డైలాగ్‌ను స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం నాడు ఫ్యాన్స్ సమక్షంలో లీక్ చేశాడు. సోదరుడు అల్లు శిరీష్ నటించిన `ఊర్వశివో రాక్షసివో` సినిమాకు సంబంధించి కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుష్ప: ది రూల్ సినిమా గురించి అభిమానులకు అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెలలో పార్ట్ 2 పుష్ప: ది రూల్ తదుపరి షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. "మీరందరూ నన్ను పుష్ప- 2 గురించి అప్‌డేట్‌లు అడుగుతున్నారని నాకు తెలుసు. నా దగ్గర ఒక చిన్న అప్‌డేట్ ఉంది. పుష్ప- 1లో 'తగ్గేదే లే' అయితే, పుష్ప 2లో 'అసలు తగ్గేదే లే' అవుతుంది. కచ్చితంగా అంతా పాజిటివ్‌గా జరుగుతుందని ఆశిస్తున్నాను. నేను ఉత్సాహంగా ఉన్నాను, ఆ ఉత్సాహం మిమ్మల్ని కూడా తాకుతుందని ఆశిస్తున్నాను''... అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచారు అల్లు అర్జున్.
పుష్ప 2 ఫస్ట్ లుక్ అదుర్స్
పుష్ప 2లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్‌ను చిత్రం సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ ఆదివారం తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ''సాహసానికి నాంది'' అని శీర్షిక పెట్టారు. పుష్ప: రూల్, రెండవ భాగం అల్లు అర్జున్, పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఫహద్ ఫాసిల్ మధ్య ఎక్కువ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఫాసిల్ పుష్ప 1లో క్లైమాక్స్‌లో మెయిన్ విలన్‌గా పరిచయం అయ్యారు. పుష్ప-2లో కూడా హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది.
పుష్ప 2 షూటింగ్‌కు సంబంధించి ఈ ఆగస్టులో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. రెండో భాగానికి కూడా సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. వాస్తవానికి తెలుగులో తీసిన పుష్ప: ది రైజ్ హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేసి విడుదల చేశారు. ఐదు భాషల్లో ఒకేసారి విడుదలైన అల్లు అర్జున్ మొదటి సినిమాగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది.
పుష్ప: ది రైజ్‌లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ - ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు రాబట్టింది. కేవలం హిందీ డబ్బింగ్ వెర్షన్ నుంచే 100 కోట్లు రాబట్టింది.