Telugu Global
Cinema & Entertainment

Varun Tej | సింగిల్ షెడ్యూల్ కోసం రూ. 15 కోట్లు

Varun Tej Matka - వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా. కేవలం ఒక్క షెడ్యూల్ కోసం 15 కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.

Varun Tej | సింగిల్ షెడ్యూల్ కోసం రూ. 15 కోట్లు
X

వరుణ్ తేజ్ కొత్త సినిమా 'మట్కా' ఈ సినిమాకు సంబంధించి మూడో షెడ్యూల్ నడుస్తోంది. 35 రోజుల పాటు సాగే లాంగ్ షెడ్యూల్ ఇది. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పాత వైజాగ్ ను గుర్తుచేస్తూ.. రామోజీ ఫిలింసిటీలో మట్కా కోసం భారీ సెట్స్ వేశారు. ఆ సెట్స్ లోనే ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది.

'మట్కా' హై బడ్జెట్‌ పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఇందులో వరుణ్ తేజ్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. 4 డిఫరెంట్ గెటప్స్ లో అతడు కనిపిస్తాడు. దేశాన్ని కదిలించిన యదార్థ ఘటనల ఆధారంగా వస్తోంది మట్కా.

పలాస ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి సెకెండ్ హీరోయిన్. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, కథ కూడా కరుణ కుమార్ దే. అంతేకాదు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విభాగాల్ని కూడా అతడే చూసుకుంటున్నాడు. తీగల విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  26 Jun 2024 4:40 PM GMT
Next Story