Telugu Global
Cinema & Entertainment

దేవర కలెక్షన్స్‌పై నిర్మాత నాగవంశీ.. షాకింగ్ కామెంట్స్

కేవలం ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచడం కోసమే మూవీ కలెక్షన్స్ రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ అన్నారు.

దేవర కలెక్షన్స్‌పై నిర్మాత నాగవంశీ.. షాకింగ్ కామెంట్స్
X

సినిమాల కలెక్షన్స్ ను చెప్పాటం అభిమానుల కోసమేనని నిర్మాత నాగవంశీ అన్నారు. కలెక్షన్స్ గురించి పోస్టర్లు వేసేది ఫ్యాన్స్ కోసమే. వాళ్లు హ్యాపీగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటామన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న మూవీ‘లక్కీ భాస్కర్‌’. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31వ తేదీన దీనిని విడుదల చేయాలనుకుంటున్నామని సినీ యూనిట్ తాజాగా తెలియజేసింది. దేవర సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగ వంశీ ఆసక్తికరమైన ధరకు దక్కించుకున్నారు.

తాజాగా విజయదశమి సందర్భంగా తమ లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన మీడియా సమావేశం నాగ వంశీ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో దేవర కలెక్షన్స్ గురించి ఆయనని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారా అంటే చాలా హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. కేవలం హీరోల అభిమానులను సంతృప్తి పరచడం కోసమే కలెక్షన్స్ నంబర్స్ రిలీజ్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దేవర సినిమా విషయంలో తాను అమ్మిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారని వాళ్లు హ్యాపీగా ఉంటే తాను కూడా ఆనండంగా ఉన్నట్లేనని అని నాగ వంశీ తెలిపారు.

First Published:  11 Oct 2024 6:08 PM IST
Next Story