Telugu Global
Cinema & Entertainment

LEO movie | చెప్పిన టైమ్ కే సినిమా రిలీజ్

Leo movie - లియో సినిమా చెప్పిన టైం కే రిలీజ్ అవుతుంది అంటున్నాడు నిర్మాత నాగ వంశీ. కోర్టు కేసు కూడా ప్రస్తావించాడు.

LEO movie | చెప్పిన టైమ్ కే సినిమా రిలీజ్
X

విజయ్ హీరోగా నటించిన లియో సినిమాకు తెలుగులో అడ్డంకి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ తమదంటూ విజయవాడకు చెందిన ఓ నిర్మాణ సంస్థ నేరుగా కోర్టుకెళ్లింది. కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న లియో నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దారు. చెప్పిన టైమ్ కు లియో సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు.


"తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. టైటిల్ ని వేరొకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది."


ఇలా లియో విడుదలపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. నిజానికి - లియో తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించారని.. పైగా తెలుగులో సెన్సార్ కూడా పూర్తయిందని తెలిపాడు. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదని.. ఒకే టైటిల్ ను వేరే వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అలా డబుల్ రిజిస్టర్ అయిన దాఖలాలు గతంలో కూడా ఉన్నాయని, ఈసారి కూడా సమస్యను పరిష్కరించుకుంటామని చెబుతున్నారు.


లియో విడుదలకు ఇంకా 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ ఒక్క రోజులో నాగవంశీ, సమస్యను పరిష్కరిస్తారా లేదా అనేది చూడాలి. కోర్టుకు వెళ్లిన సదరు నిర్మాతతో ఒక అంగీకారానికి రావడమే కాకుండా, ఈ ఒక్క రోజులోనే కోర్టు నుంచి తన కేసును కూడా ఆయన విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురైనా, లియో మార్నింగ్ షోలపై ఆ ప్రభావం పడుతుంది.

First Published:  18 Oct 2023 9:40 AM IST
Next Story