Telugu Global
Cinema & Entertainment

ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దిల్‌ రాజు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దిల్‌ రాజు
X

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (వి. వెంకటరమణారెడ్డి)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన దిల్‌ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్‌ ప్రొడ్యూసర్‌లలో ఒకరు. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈనెల మూడో తేదీన దిల్‌ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా.. ఆ జీవో శనివారం వెలుగులోకి వచ్చింది.





First Published:  7 Dec 2024 10:14 AM IST
Next Story