Saripodhaa Sanivaaram | అమాయకపు పోలీస్
Saripodhaa Sanivaaram - నాని లుక్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక మోహన్ లుక్ రిలీజైంది.

నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సరిపోదా శనివారం'. సినిమాలో నేచురల్ స్టార్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో ఆమెకిది రెండో సినిమా. తాజాగా మేకర్స్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియాంక మోహన్ చారులత అనే అమాయకపు పోలీసుగా కనిపించింది. ఆమె క్యారెక్టర్‌లో ఫిట్‌గా కనిపిస్తుంది. అందమైన చిరునవ్వు ఆకట్టుకుంది. ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌తో నడుస్తూ కనిపించింది. సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు మురళి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే నెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. సరిపోదా శనివారం షూటింగ్ చివరి దశలో ఉంది.