Priyanka Mohan - పవన్ సరసన హీరోయిన్ ఫిక్స్
Priyanka Mohan Pawan Kalyan - పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం అందుకుంది ప్రియాంక మోహన్. తన కెరీర్ కు ఇది గేమ్ ఛేంజర్ అని భావిస్తోంది.

ప్రస్తుతం పవన్ సినిమాలకు స్టార్ హీరోయిన్లు అక్కర్లేదు. నిజానికి స్టార్ హీరోయిన్లు ఉంటేనే పవన్ సినిమాలకు ఇబ్బంది. పవన్ ఎప్పుడు కాల్షీట్ ఇస్తాడో తెలీదు. అలా ఇచ్చిన కాల్షీట్ తో స్టార్ హీరోయిన్ కాల్షీట్ ను మ్యాచ్ చేయడం మరీ కష్టం. అందుకే నిత్యం అందుబాటులో ఉండే హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు.
సుజీత్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. దాని పేరు ఓజీ. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో మొదలవుతుంది. ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు. పవన్ కాల్షీట్లకు తగ్గట్టు డేట్స్ ఇవ్వాలనే ఒప్పందంపై ఈమెను తీసుకున్నారు.
ఈ సినిమాకు పవన్ 35 రోజులు కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంది. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే, అప్పుడు ప్రియాంక అందుబాటులో ఉండాలన్నమాట.
గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ప్రియాంక మోహన్. ఆ తర్వాత శ్రీకారం అనే సినిమా చేసింది. మధ్యలో వరుణ్ డాక్టర్ అనే డబ్బింగ్ సినిమాతో కూడా పలకరించింది. తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు, పవన్ సినిమా అనేది చాలా పెద్ద ఆఫర్. అందుకే వెంటనే ఓకే చెప్పింది.