చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించిన ప్రియాంక చోప్రా
బాలాజీ ఆశిస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పోస్ట్
BY Raju Asari21 Jan 2025 7:11 PM IST

X
Raju Asari Updated On: 21 Jan 2025 7:12 PM IST
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బాలాజీ ఆశిస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు
తెలిపారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన విషయం విదితమే.
మహేశ్ బాబు హీరోగా రాజమౌలిక తెరకెక్కించనున్న SSMB29 (వర్కింగ్ టైటిల్) లో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌కు వచ్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ సినిమాను ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్లు పలువురు సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
Next Story