Telugu Global
Cinema & Entertainment

Salaar | సొంతంగా డబ్బింగ్ చెప్పిన పృధ్వీరాజ్

Salaar - సలార్ సినిమాలో పృధ్వీరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పాడు ఈ నటుడు.

Salaar | సొంతంగా డబ్బింగ్ చెప్పిన పృధ్వీరాజ్
X

పృథ్వీరాజ్ సుకుమార్, సలార్ లో తన పార్ట్ పూర్తిచేశాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ పాన్-ఇండియన్ చిత్రం సలార్ కోసం ఈ మలయాళ స్టార్, తన డబ్బింగ్ పనిని పూర్తి చేశాడు. ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశాడు.

సలార్ కోసం 5 భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి సంచలనం సృష్టించాడు పృథ్వీరాజ్. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ పెట్టాడు. వివిధ భాషలలో తన పాత్రలన్నింటికీ తన స్వంత వాయిస్‌ని ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

తన పాత్రకు, తనతో డబ్బింగ్ చెప్పిస్తేనే నటించడానికి అంగీకరిస్తానని ముందే కండిషన్ పెట్టాడు పృధ్వీరాజ్. ఇప్పటివరకు ఈ నటుడు ఇలానే చేశాడు. సలార్ కోసం కూడా అదే కండిషన్ పెట్టి మరీ, ఇప్పుడు డబ్బింగ్ పూర్తి చేశాడు. అయితే ఒకే పాత్రకు ఇలా 5 భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి అని తెలిపాడు పృధ్వీరాజ్.

డిసెంబర్ 22న థియేటర్లలోకి వస్తోంది సలార్ సినిమా. ఈ సినిమాలో రెండు కీలక పాత్రల్లో నటించారు ప్రభాస్, పృధ్వీరాజ్. దేవా, వరద 22న మిమ్మల్ని కలుస్తారంటూ పోస్ట్ పెట్టాడు పృధ్వీరాజ్. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరికొన్ని రోజుల్లో సలార్ నుంచి రెండో ట్రయిలర్ కూడా రాబోతోంది.

First Published:  11 Dec 2023 10:19 PM IST
Next Story