Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్ కు విల‌న్ గా మ‌ల‌యాళ స్టార్ హీరో..!?

రాజమౌళి తన తదుపరి సినిమాలో మహేష్ బాబు కు విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఖ‌రారు చేశారని ఫిలిం సర్కిల్స్ లో బలంగా ప్రచారం జరుగుతోంది.

మ‌హేష్ కు విల‌న్ గా మ‌ల‌యాళ స్టార్ హీరో..!?
X

గుంటూరు కారం అనంతరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో వీరి కాంబో ప్రాజెక్ట్ సెప్టెంబ‌ర్ లో స్టార్ట్ కాబోతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుండ‌గా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు-రాజ‌మౌళి సినిమా ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. స్క్రిప్ట్ వ‌ర్క్ కంప్లీట్ అయింది. కాస్టింగ్ ఎంపిక కూడా మొద‌లైంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ లీక్ బయటకు వచ్చింది. రాజమౌళి తన తదుపరి సినిమాలో మహేష్ బాబు కు విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఖ‌రారు చేశారని ఫిలిం సర్కిల్స్ లో బలంగా ప్రచారం జరుగుతోంది.

కథలో ప్రతినాయకుడి పాత్రకు పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫెక్ట్ గా సరిపోతారని రాజమౌళి భావించార‌ట‌. అందులో భాగంగానే పృథ్వీరాజ్ తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా.. స్టోరీ మ‌రియు త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంలో వెంట‌నే ఆయ‌న ఓకే చెప్పార‌ని టాక్ నడుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. కానీ నిజ‌మైతే మాత్రం అభిమానులు మ‌రియు సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవ్వ‌డం ఖాయం.

కాగా, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక‌రు. న‌టుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయ‌న స‌త్తా చాటుతున్నారు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. డ‌బ్బింగ్ చిత్రాల ద్వారా సౌత్ లోని మిగ‌తా భాష‌ల్లోనూ పాపుల‌ర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్.. స‌లార్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

First Published:  3 July 2024 9:15 AM
Next Story