'ఛావా' మూవీపై ప్రధాని ప్రశంసలు.. విక్కీ కౌశల్ రియాక్షన్ ఇదే
దీనిపై విక్కీ కౌశల్ స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. తమ సినిమాను ప్రశంసించిన మోడీకి ప్రత్యేకంగా థ్యాంక్స్

ఉత్తరాది ఉంచి దక్షిణాది వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు 'ఛావా' మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నద.ఇ ఇక ఈ సినిమా హీరోపై ప్రశంసంల జల్లు కురుస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీ కూడా మూవీ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 98 అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 'ఛావా' సినిమాను ఉద్దేశించి మాట్లాడారు. హిందీతో పాటు మరాఠీ సినిమాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబయి కీలకపాత్ర పోషించింది. 'ఛావా' ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుంటున్నది. శివాజీ సావంత్ మరాఠీ కారణంగానే ఈ శంభాజీ మహరాజ్ వీరత్వాన్ని ఇప్పుడు సినిమా చూపంలో పరిచయం చేయడం సాధ్యమైందన్నారు.
అయితే దీనిపై విక్కీ కౌశల్ స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. తమ సినిమాను ప్రశంసించిన మోడీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సంతోషంతో మాటలు రావడం లేదని ఇన్‌ష్టా వేదికగా ఎమోషనల్ అయ్యారు. 'ఇది ఒక చారిత్రక గౌరవం. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ ఛావాను ప్రశంసించడం, అలాగే ఛత్రపతి శంభాషీ మహరాజ్ త్యాగాన్ని కీర్తించడం గర్వించదగిన గొప్ప క్షణం' అంటూ విక్కీ చెప్పుకొచ్చారు.