Telugu Global
Cinema & Entertainment

ది సబర్మతి రిపోర్ట్‌ సినిమా చూసిన ప్రధాని మోదీ

కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మూవీ చూసిన ప్రధాని

ది సబర్మతి రిపోర్ట్‌ సినిమా చూసిన ప్రధాని మోదీ
X

గోద్రా అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన సినిమా 'ది సబర్మతి రిపోర్ట్‌' సినిమాను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం చూశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి బలయోగి ఆడిటోరియంలో సినిమాను చూశారు. తాను సినిమా చూస్తున్న ఫొటోలను ఎక్స్‌లో ప్రధాని పోస్ట్‌ చేశారు. 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలును గుజరాత్‌లోని గోద్రా వద్ద కొందరు వ్యక్తులు దహనం చేశారు. ఈ సినిమాకు అవినాశ్‌, అర్జున్‌ మూల కథ అందించగా అసీమ్‌ అరోరా కథ సమకూర్చారు. మొదట రంజన్‌ చందేల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోగా ధీరజ్‌ శర్మ సినిమాను పూర్తి చేశారు. ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌, అమూల్‌ వి మోహన్‌, అన్సూల్‌ వి మోహన్‌ నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 15న విడుదలైంది. విక్రాంత్‌ మాసే, రాశీ కన్నా, రిధి డోగ్రా, బర్కాసింగ్‌, సందీప్‌ వేద్‌ తదితరులు సినిమాను నిర్మించారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు, ఎన్‌డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల ఎంపీలు సినిమా చూశారు.





First Published:  2 Dec 2024 8:07 PM IST
Next Story