Telugu Global
Cinema & Entertainment

Bimbisara 2 | ప్రీక్వెల్ ప్రకటించిన కల్యాణ్ రామ్

Bimbisara 2 - కల్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ బంబిసార. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ ప్రకటించారు.

Bimbisara 2 | ప్రీక్వెల్ ప్రకటించిన కల్యాణ్ రామ్
X

హీరో - నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో అతిపెద్ద విజయం బింబిసార. దీనికి పార్ట్-2 ఉంటుందని మేకర్స్ చాన్నాళ్ల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా వివరాలు బయటకొచ్చాయి.

బింబిసార ప్రీక్వెల్‌ని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. ఈ మేరకు ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. 'బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి' అంటూ ప్రీక్వెల్‌ని ప్రకటించారు.

బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్‌ బింబిసారగా కనిపించారు. ప్రీక్వెల్‌లో అంతకు మించిన అద్భుతమైన కథను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. బింబిసారను వశిష్ఠ డైరక్ట్ చేయగా.. ప్రీక్వెల్ బాధ్యతల్ని మాత్రం అనీల్ పాదూరికి అప్పగించాడు కల్యాణ్ రామ్. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

First Published:  5 July 2024 2:48 PM GMT
Next Story