Telugu Global
Cinema & Entertainment

ఆ సుఖం కోసం కోట్లు వెచ్చించాల్సిన అవసరం లేదు

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందా? దీనిపై సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఏమంటున్నారు?

ఆ సుఖం కోసం కోట్లు వెచ్చించాల్సిన అవసరం లేదు
X

కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. కొంతమంది అసలు కాస్టింగ్ కౌచ్ అనేది తమకు ఎదురుకాలేదని చెప్పగా, మరికొంతమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం తమకు ఇండస్ట్రీలో వేధింపులు ఎదురయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ అంశంపై సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా స్పందించారు.

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటున్నారు ప్రగతి. అయితే టాలీవుడ్ మొత్తాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. స్టార్ హీరోయిన్లు ఎవరూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు తమకు ఎదురవ్వలేదనే చెబుతారని, ఎందుకంటే వాళ్లు తమ కెరీర్ పై మాత్రమే దృష్టి పెడతారని అన్నారు ప్రగతి. సక్సెస్ దక్కని హీరోయిన్లు మాత్రమే కాస్టింగ్ కౌచ్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా మరో సంచలన ప్రకటన చేశారు ప్రగతి. హీరోయిన్లను కేవలం పడక సుఖం కోసం నిర్మాతలు తీసుకుంటారనే వాదన సరికాదన్నారు. కేవలం పడక సుఖం కోసం కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి, అందులో కీలకమైన హీరోయిన్ ను తీసుకోవడం జరగదని, హీరోయిన్లకు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేది 5 నిమిషాల పడక సుఖం కోసం కాదని, ఆ సుఖమే కావాలనుకుంటే కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు ప్రగతి.

అలా అని కాస్టింగ్ కౌచ్ ఘటనల్ని తీసి పారేయలేమని, కొందరు నిర్మాతలు హీరోయిన్లను ఆ కోణంలోనే చూస్తున్నారని, అంత మాత్రాన ఇండస్ట్రీ మొత్తంలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు ప్రగతి.

First Published:  4 Sept 2022 6:11 PM IST
Next Story