Telugu Global
Cinema & Entertainment

Chatrapathi Re release | ఛత్రపతి రీ-రిలీజ్ ఏమైంది?

Chatrapathi Re-release - ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఛత్రపతి. రీ-రిలీజ్ లో మాత్రం ఈ సినిమా నిలబడలేకపోయింది.

Chatrapathi Re release | ఛత్రపతి రీ-రిలీజ్ ఏమైంది?
X

ఛత్రపతి రీ-రిలీజ్ ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన సినిమాలు దానిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ యాక్షన్ డ్రామా ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రమనే సినిమా అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని 4Kకి రీ-మాస్టర్ చేసి, ప్రభాస్ పుట్టినరోజున రీ-రిలీజ్ చేశారు. కానీ, ఛత్రపతి రీ-రిలీజ్ ఘోరంగా విఫలమైంది. కొత్తగా విడుదలైన దసరా సినిమాలు ఈ సినిమాకు థియేటర్లు దక్కకుండా చేశాయి.

నిజానికి రీ-రిలీజ్ కల్చర్ దాదాపు ముగిసింది. రీ-రిలీజ్ లో ఆకట్టుకుంటున్న సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఛత్రపతి సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. రీ-రిలీజ్ కోసం షెడ్యూల్ చేయబడిన తదుపరి పెద్ద చిత్రం మెగాస్టార్ శంకర్ దాదా MBBS. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా హక్కులు, రీమాస్టరింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇది నవంబర్ 4న విడుదలవుతోంది. ఇది ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.

2005లో ప్రభాస్, రాజమౌళి మొదటి కలయికలో వచ్చిన 'ఛత్రపతి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాతో ప్రభాస్ స్టార్ అయిపోయాడు. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. సినిమాలో భాను ప్రియ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

ఈ సినిమాను తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేశాడు. అక్కడ ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడీ సినిమా రీ-రిలీజ్ లో కూడా తెలుగులో డిజాస్టర్ అయింది.

First Published:  26 Oct 2023 8:00 PM IST
Next Story