Project K: రెండు భాగాలుగా రాబోతున్న ప్రాజెక్ట్-K?
Prabhas Project K 2 parts - ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K సినిమా కూడా 2 భాగాలుగా వస్తుందట. నాగ్ అశ్విన్ దీనికి దర్శకుడు.
ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలన్నీ ఇకపై 2 భాగాలుగా వస్తాయేమో అనిపిస్తోంది. సలార్ ను ఇప్పటికే 2 భాగాలుగా తీయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ప్రాజెక్ట్-కె కూడా రెండు భాగాలుగా వస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అసలు ప్రభాస్ కే ఎందుకిలా జరుగుతోంది?
సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నాడు ప్రభాస్. దీనికితోడు ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. క్రేజ్ ఉన్న నటీనటుల్ని తీసుకుంటే రెమ్యూనరేషన్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ తిరిగి రాబట్టాలంటే సినిమాను 2 భాగాలుగా తీయాల్సిందే. లేదంటే నిర్మాతకు ఇబ్బంది అవుతుంది.
ఇదే కోణంలో ఆలోచించి ప్రాజెక్ట్-కె ను 2 భాగాలుగా తెస్తున్నట్టున్నారు. ఇందులో దీపిక పదుకోన్, అమితాబ్ లాంటి భారీ తారాగణం ఉంది. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి, మరోవైపు ప్రొడక్షన్ కాస్ట్ కూడా భారీగా పెరిగిపోతోంది. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్-కే ను 2 భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించినట్టున్నారు.
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా, అల్లు అర్జున్ పుష్ప సినిమాలు 2 భాగాలుగా వస్తున్నాయి. కథ డిమాండ్ చేస్తే ఇలా 2 భాగాలుగా తీసుకురావడం తప్పులేదు. కానీ బడ్జెట్ లెక్కలేసుకొని సినిమాను ఇలా 2 ముక్కలు చేయడం కరెక్ట్ కాదు.