Telugu Global
Cinema & Entertainment

క‌ల్కి వీర విహారం.. ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్ ఇవే!

తాజాగా క‌ల్కి ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వీకెండ్ ముగిసే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి చిత్రం రూ. 110.53 కోట్ల షేర్‌, రూ. 171.15 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసి దుమ్ము దుమారం లేపింది.

క‌ల్కి వీర విహారం.. ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్ ఇవే!
X

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క తాజా చిత్రం క‌ల్కి 2898 ఏడీ గ‌త వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అశ్వినీ ద‌త్ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్ మూవీ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద వీర విహారం చేస్తోంది.

సౌత్, నార్త్ తో పాటు విదేశాల్లో సైతం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్ కు ర‌ప్పిస్తున్న క‌ల్కి.. అంచనాలను అధిగమించి వ‌సూళ్ల‌ను అందుకుంటోంది. అలాగే విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ప్ర‌భాస్ ను 500 కోట్ల సింహాస‌నంపై కూర్చోబెట్టింది. తాజాగా క‌ల్కి ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వీకెండ్ ముగిసే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి చిత్రం రూ. 110.53 కోట్ల షేర్‌, రూ. 171.15 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసి దుమ్ము దుమారం లేపింది.

అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌ల్కి మూవీకి ఫ‌స్ట్ వీకెండ్ లో రూ. 265.73 కోట్ల షేర్‌, రూ. 507.30 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 372 కోట్ల వ‌ర‌కు ఉంది. అయితే రిలీజ్ అయిన‌ నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 265.73 కోట్లు వ‌చ్చేశాయి. ఇంకా రూ. 106.27 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబ‌డితే క‌ల్కి బాక్సాఫీస్ వ‌ద్ద బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఎలాగో టాక్ పాజిటివ్ గా ఉంది. పైగా ఇప్ప‌ట్లో పెద్ద హీరోల సినిమాలేవి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. కాబ‌ట్టి ఫుల్ ర‌న్ లో కల్కి బ్రేక్ ఈవెన్ దాటి రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

First Published:  1 July 2024 10:41 AM GMT
Next Story