Telugu Global
Cinema & Entertainment

పొట్టేల్ సినిమా ట్రైలర్‌ విడుదల..హక్కులపై పోరాటం

అనన్య నాగళ్ళ, యువచంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ పొట్టేల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

పొట్టేల్ సినిమా ట్రైలర్‌ విడుదల..హక్కులపై పోరాటం
X

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా పొట్టేల్. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. 1980లోని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఉన్న మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాను నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మించారు .తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.1980ల కాలంలో తెలంగాణ సరిహద్దులో మహరాష్ట్రలోని విదర్భకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో జరిగిన స్టోరి ఇది అంటూ మొదలైన ట్రైలర్ లో.. ఆనాటి తెలంగాణ గ్రామీణ ప్రాంతల్లో ఉన్న ఆధిపత్యం, అణచివేతలు, అంటరానితనం పిల్లలను చదువుకు దూరం చేస్తూ జోగిని, మాతంగి వ్యవహారాలు..

ఊరి పెద్దల దురాగతాలు.. వీటిని ఎదురిస్తూ.. సరస్వతి అనే పేరు పెట్టుకున్న తన బిడ్డకి చదువు చెప్పించే ప్రయత్నం చేసిన పేద తండ్రి యాతన.. ఇవన్నీ కనిపిస్తున్నాయీ ట్రైలర్ లో.ట్రైలర్ చూస్తే ఆ కాలంలో మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కూతురికి చదివించాలని తండ్రిపడే కష్టం.. ఆ నాటి పరిస్థితుల ఆధారంగా స్టోరీ తీసుకొస్తున్నట్లు ‍తెలుస్తోంది. కాగా.. ఈ సినిమా నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈనెల 25న థియేటర్లలో పొట్టేల్ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీమందించారు. అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషించారు.

First Published:  18 Oct 2024 7:57 PM IST
Next Story