Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | పుష్ప-2పై అనుమానాలు?

Pushpa 2 - పుష్ప-2పై కొత్త పుకార్లు చెలరేగుతున్నాయి. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంట.

Pushpa 2 | పుష్ప-2పై అనుమానాలు?
X

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప-2పై పుకార్లు కొత్తేం కాదు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి ఈ మూవీపై ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. అయితే ఈసారి ఓ ఊహాగానం చాలా బలంగా వినిపిస్తోంది. అదేంటంటే, పుష్ప-2 సినిమా వాయిదా పడిందంట.

ఈ మాట ఒకరిద్దరం అనడం లేదు. అంతా మూకుమ్మడిగా చెబుతున్న మాటిది. దీనికి కొన్ని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు వీళ్లు. ఉదాహరణకు బాలీవుడ్ నే తీసుకుంటే, పుష్ప-2కు అన్ని సినిమాలు దారిస్తుంటే, జాన్ అబ్రహాం సినిమా రిలీజ్ అవుతోంది.

అటు తమిళనాట కూడా ఆగస్ట్ 15న పుష్ప-2కు పోటీగా తంగళాన్ రిలీజ్ అవుతోంది. నిజంగా పుష్ప-2 సినిమా బరిలో ఉంటే, తంగళాన్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయరు. కానీ విక్రమ్ సినిమా వస్తోందంటే, బన్నీ సినిమా వాయిదా పడి ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు.

అటు యూనిట్ పరంగా కూడా ఆగస్ట్ 15 రిలీజ్ కష్టం అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. పైగా సుకుమార్ కు మరింత టైమ్ కావాలంట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, పుష్ప-2పై అనుమానాలు నిజమే అనిపిస్తుంది.

First Published:  12 Jun 2024 4:55 PM GMT
Next Story