Pooja Hegde: నాగ్ తో కలిసి నటిస్తున్న పూజా హెగ్డే
Pooja Hegde: నాగార్జునతో కలిసి నటించింది పూజా హెగ్డే. ఇద్దరూ కలిసి ఏం చేశారు.. లెట్స్ చెక్..
BY Telugu Global9 Jan 2023 1:00 PM IST

X
Telugu Global Updated On: 9 Jan 2023 1:01 PM IST
హీరోయిన్ పూజాహెగ్డే, సీనియర్ హీరో నాగార్జున కలిశారు. ఇద్దరూ కలిసి కెమెరా ముందుకొచ్చారు. చక్కగా నటించారు. అదేంటి.. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారా?
చాలామందికి అదే ఆశ్చర్యం ఉంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఓ స్టార్ హీరో, ఓ స్టార్ హీరోయిన్ ఎలా కలిశారనే సందేహం ఉంది. కాకపోతే వీళ్లు కలిసింది సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూటింగ్ కోసం.
అవును.. ఓ కూల్ డ్రింక్ యాడ్ కోసం నాగ్-పూజాహెగ్డే కలిశారు. ఇద్దరితో యాడ్ షూటింగ్ కూడా ముగిసింది. నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం పూజాహెగ్డేకు ఇదే తొలిసారి. ఇంతకుముందు అఖిల్ తో ఆమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేసింది.
ప్రస్తుతం పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. మహేష్ బాబు మూవీ కోసం ఆమె వెయిటింగ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే.
Next Story