Telugu Global
Cinema & Entertainment

'అమ్మాయి'లో అవకాశం అలా వచ్చింది!

మరో అమ్మాయి సినీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. అయితే ఈమె అందంతో ఇండస్ట్రీకి రావడం లేదు

పూజా భాలేకర్
X

పూజా భాలేకర్

మరో అమ్మాయి సినీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. అయితే ఈమె అందంతో ఇండస్ట్రీకి రావడం లేదు, టాలెంట్ తో వస్తోంది. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడితో కలిసి వస్తోంది. ఆమె పేరు పూజా భలేకర్. మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో విజయాలు సాధించిన ఈ అమ్మాయి, ఇప్పుడు అదే టాలెంట్ ను పెట్టుబడిగా పెట్టి ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది.

పూజా భలేకర్ లీడ్ రోల్ పోషించిన సినిమా 'అమ్మాయి'. బ్రూస్ లీ నటించిన సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకొని, అతడికి అంకితమిస్తూ తీసిన ఈ సినిమాతో ఈమె వెండితెరకు పరిచయమౌతోంది. ఈ సినిమా అవకాశం ఎలా వచ్చిందో వివరించింది పూజ.

"నేను ఎప్పుడూ నటిని అవుతానని అనుకోలేదు. నేను చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ మీద ఫోకస్ పెట్టాను. అయితే నేను ఆర్జీవీ కి పెద్ద అభిమానిని. ఆయన్నుంచి ఫోన్ రాగానే ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించింది. నేను నా తండ్రితో కలిసి ముంబైలోని ఆయన ఆఫీస్‌కు వెళ్లాను. అయితే బ్రూస్‌లీకి నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నాకు ఆ టైంకు తెలీదు. మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి కావాలని అన్నారు.. నేను అందుకే వచ్చానని అనుకున్నాను. ఆడిషన్ ఇచ్చాను. ఆయనకు నచ్చింది. ఆ తరువాత స్టోరీ చెప్పారు. బ్రూస్‌లీ మీద సినిమా అని, బ్రూస్‌లీ మీద ఆయనకున్న ఇష్టాన్ని చెప్పారు. ఇలాంటి ఓ సినిమాతో, ఆర్జీవీ లాంటి దర్శకుడితో నా కెరీర్ స్టార్ట్ చేయడం సరైన చాయిస్ అనుకున్నాను. వెంటనే ఓకే చెప్పాను."

ఇలా తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి బయటపెట్టింది పూజా భలేకర్. ఈ సినిమాలో కేవలం మార్షల్ ఆర్ట్స్ చేయడం మాత్రమే కాకుండా, అందాలు కూడా ఆరబోసింది ఈ పిల్ల. దీనిపై కూడా పూజ స్పందించింది. తను నటిగా కెరీర్ కొనసాగించాలనుకుంటున్నానని, కాబట్టి గ్లామరస్ గా కూడా కనిపించానని అంటోంది.


పూజా భాలేకర్



First Published:  14 July 2022 12:59 PM IST
Next Story