Telugu Global
Cinema & Entertainment

Aman Preet | డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు

Aman Preet - రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Aman Preet | డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు
X

హైదరాబాద్ లో మరో డ్రగ్స్ కలకలం రేగింది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ ముఠాను హైదరాబాద్ శివార్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల వద్ద నుంచి 200 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 35 లక్షలకు పైనే ఉంటుంది. దీంతో పాటు 2 పాస్ పోర్టులు, 10 ఫోన్లు, 2 బైకులు కూడా స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో కీలక సభ్యురాలు ఒనహా బ్లెస్సింగ్. ఈమె నైజీరియా నుంచి హైదరాబాద్ కు ఇప్పటివరకు 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చింది. ఆమె దగ్గర్నుంచి 13 మంది మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారు. అలా డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించగా, వాళ్లలో ఆరుగురికి పాజిటివ్ తేలింది.

పాజిటివ్ గా తేలిన వాళ్లలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. అతడు తెలుగులో హీరోగా ఓ సినిమా కూడా చేశాడు. ఇక మిగిలిన వాళ్ల పేర్లు అంకిత్, నిఖిల్, ప్రసాద్. వీళ్లంతా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉంటున్నారు.

గతంలో ఓసారి రకుల్ ప్రీత్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించింది. ఇప్పుడు ఏకంగా ఆమె సోదరుడు పాజిటివ్ గా తేలి, పట్టుబడ్డాడు.

First Published:  15 July 2024 4:42 PM GMT
Next Story