Telugu Global
Cinema & Entertainment

Peddha Kapu 1 - పెదకాపు-1 ట్రయిలర్ రివ్యూ

Peddha Kapu 1 - శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కింది పెదకాపు-1. తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

Peddha Kapu 1 - పెదకాపు-1 ట్రయిలర్ రివ్యూ
X

సమాజంలో సామాజిక న్యాయం లేకపోవడం వల్ల విప్లవాలు పుట్టుకొస్తాయి. పెదకాపు-1 ఉన్నత వర్గానికి చెందిన ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు ఆధిపత్యం కోసం పోరాడుతుంటారు. అలాంటి గ్రామంలో అణచివేతకు గురయ్యే యువకుడి కథే పెదకాపు-1. ఈ రోజు రిలీజైన ట్రయిలర్ లో ఇదే విషయాన్ని చెప్పారు.

ఆధిపత్యం ఉన్న గ్రామంలో కుల అణచివేతను ప్రజంట్ చేస్తోంది పెదకాపు 1 ట్రయిలర్. ట్రైలర్‌లో సినిమా కథాంశాన్ని వెల్లడించే అంశాలు చాలా ఉన్నాయి. సంక్షోభం ఏర్పడినప్పుడు అది విప్లవానికి దారి తీస్తుంది, అణచివేతదారులకు వ్యతిరేకంగా ఒక సామాన్యుడు తన స్వరాన్ని వినిపించి, వారిపై హింసాత్మక యుద్ధాన్ని కూడా మొదలుపెడతాడు.

ట్రైలర్‌లో విరాట్ కర్ణ అద్భుతంగా కనిపించాడు. ఫెరోషియస్ గా కనిపించిన విరాట్ సినిమాలో ఎక్స్ టార్డినరీ పెర్ ఫార్మెన్స్ కనబరిచాడని స్పష్టంగా తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల బ్రిలియంట్ వర్క్ చేశాడు. అంతేకాదు, సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. ట్రయిలర్ లో అతడు కూడా ఉన్నాడు.

ట్రైలర్ లో డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ట్రైలర్‌లో దాదాపు ప్రతి సీక్వెన్స్‌లోనూ అదే ఇంటెన్సిటీ ఉంది. దాదాపు 2.5 నిమిషాల నిడివి గల ట్రయిలర్, వయొలెన్స్ తో నిండి ఉంది. పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్ గా ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల ప్రధాన విలన్స్ లో ఒకరిగా నటించడం ఆసక్తికరంగా ఉంది.

ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందించారు. కథనాన్ని నేచురల్ గా, స్ట్రాంగ్ గా చేయడానికి డార్క్ థీమ్‌ను ఎంచుకున్నారు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌కు మరింత బలం చేకూర్చాడు. 29న థియేటర్లలోకి వస్తోంది పెదకాపు-1 సినిమా.

First Published:  11 Sept 2023 11:22 PM IST
Next Story