Mangalavaaram - మంగళవారం సినిమా నుంచి పాయల్ ఫస్ట్ లుక్
Payal Rajput Mangalavaaram Movie - మంగళవారం సినిమా నుంచి పాయల్ ఫస్ట్ లుక్ రిలీజైంది. లుక్ బాగా బోల్డ్ గా ఉంది.

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మంగళవారం'. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. దర్శకుడ్ అజయ్ భూపతి కూడా ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహహిస్తున్నాడు.
ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించారు. సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
'మంగళవారం' సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు. ఆ లుక్ చూస్తే... పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు.
'ఆర్ఎక్స్ 100'తో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పాయల్ కూడా ఇదే సినిమాతో పరిచయమైంది. మళ్లీ ఇన్నాళ్లకూ ఇద్దరూ ఇలా కలిశారు.
గ్రామీణ నేపథ్యంలో 90వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. ఈ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ లో మొత్తం 30 పాత్రలుంటాయంట. ఇప్పటివరకు 75 రోజులు షూట్ చేశారు. వచ్చే నెలలో ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అజనీష్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.