Ustad Bhagat Singh - ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్
Ustad Bhagat Singh First Glimpse - పవన్-హరీశ్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ దర్శకుడు. గబ్బర్ సింగ్ తర్వాత... పవన్-హరీశ్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. అందుకే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు కాస్త ముందుగానే ఈ సినిమా గ్లింప్ల్ రిలీజ్ చేశారు.
నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న షెడ్యూల్ మాత్రమే జరిగింది. కానీ పవన్ పై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, షూట్ చేసిన ఆ కొద్దిపాటి విజువల్స్ తోనే గ్లింప్స్ కట్ చేసి విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గబ్బర్ సింగ్ కు కూడా ఇతడే సంగీత దర్శకుడు.
గ్లింప్స్ లో పవన్ లుక్స్ బాగున్నాయి. ఇందులో పవన్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. మంచి పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా చెప్పాడు. పనిలోపనిగా తన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ తో టీ కూడా తాగుతూ కనిపించాడు.
ఇదొక రీమేక్ అనే విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ నటించిన సినిమాకు రీమేక్ ఇది. ఈ రీమేక్ స్క్రిప్ట్ పనుల్లో దశరథ్ కూడా ఉన్నాడు. తమిళ్ వెర్షన్ కు, తెలుగులో వస్తున్న ఉస్తాద్ గబ్బర్ సింగ్ కు చాలా తేడా ఉందంటున్నారు మేకర్స్. ఓవరాల్ గా ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఆక్టటుకునేలా ఉంది.