Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అల్లు అర్జున్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ఎవరికి చుట్టం కాదని అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి కానీ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని పవన్ అన్నారు. మానవతా దృక్పథం లోపించనట్టు అయిందని, అల్లు అర్జున్ యే కాదు కనీసం టీమ్ అయినా సంతాపం చెప్పి ఉండాల్సింది అని డిప్యూటీ సీఎం విమర్శలు చేశారు.

తన పేరు చెప్పలేదని సీఎం రేవంత్‌రెడ్డి అర్జున్ ను అరెస్టు చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని పవన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని అన్నారు. రేవంత్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ ప్రశంశలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారని, పుష్ప-2 బెనిఫిట్ షో లకు టికెట్ రేట్లు పెంచడం పరిశ్రమనను ప్రోత్సహించడమేనని పవన్ కళ్యాణ్ అన్నారు.

First Published:  30 Dec 2024 1:30 PM IST
Next Story