Telugu Global
Cinema & Entertainment

OG Movie | ఓజీ కొత్త పోస్టర్ విడుదల

Pawan Kalyan's OG Movie - ఓజీ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఫ్యాన్స్ కు ఎక్స్ ట్రా కిక్ ఇచ్చింది.

OG Movie | ఓజీ కొత్త పోస్టర్ విడుదల
X

పవన్ కల్యాణ్ తాజా చిత్రం ఓజీ. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది, గ్లింప్స్ కూడా వచ్చింది. తాజాగా సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ వెనక ఓ కారణం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం సెగ్మెంట్ నుంచి భారీ మెజారిటీతో గెలిచారు పవన్ కల్యాణ్. సోషల్ మీడియా మొత్తం పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోయింది. ఈ ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ఆఘమేఘాల మీద ఓజీ నుంచి ఈ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్ లో పవన్ ఓ కుర్చీలో కూర్చున్నట్టు చూపించారు. వెనక మంటలు చెలరేగుతున్నాయి. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల్లో ఈ పోస్టర్ మరింత ఉత్సాహాన్ని నింపింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఓజీ సినిమా.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించి పవన్ ఇంకా 20 రోజులు వర్క్ చేయాల్సి ఉంది. మూవీ ట్రయిలర్ ఆల్రెడీ రెడీగా ఉంది.

First Published:  4 Jun 2024 5:26 PM GMT
Next Story