Telugu Global
Cinema & Entertainment

OG Movie | పవన్ సినిమా ఫస్ట్ లుక్ రెడీ, టైటిల్ పై క్లారిటీ!

Pawan Kalyan's OG Movie - పవన్ కల్యాణ్ తాజా చిత్రం ఓజీ. ఈ సినిమా టైటిల్ పై యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

OG Movie | పవన్ సినిమా ఫస్ట్ లుక్ రెడీ, టైటిల్ పై క్లారిటీ!
X

ఈమధ్య ప్రభాస్ సినిమాకు టైటిల్ మార్చేశారు. ప్రారంభం నుంచి ప్రాజెక్టు-K అంటూ వ్యవహరించిన ఈ సినిమాకు ఉన్నఫలంగా పేరు మార్చేసి కల్కి అనే టైటిల్ పెట్టారు. దీంతో చాలామంది అటు ప్రాజెక్టు-K, అటు కల్కి టైటిల్స్ రెండింటినీ వాడుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురవుతున్నారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాకు కూడా ఇదే జరగబోతోందనే ప్రచారం మొదలైంది. సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు పవన్. ఈ టైటిల్ బాగా పాపులర్ అయింది. కాకపోతే త్వరలోనే ఓ కొత్త టైటిల్ ప్రకటిస్తారనే ప్రచారం మొదలైంది. దీంతో పవన్ ఫ్యాన్స్ లో అలజడి రేగింది.

ఓజీ సినిమాకు అదే టైటిల్ ఉంచాలని, మార్చొద్దని నిర్మాతలకు విన్నపాలు ఎక్కువయ్యాయి. వీటిపై వెంటనే స్పందించింది డీవీవీ ఎంటర్ టైనర్ మెంట్స్ సంస్థ. తమ సినిమాకు ఓజీ అనే టైటిల్ నే ఉంచుతామని స్పష్టం చేసింది. అంతేకాదు, త్వరలోనే టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించింది

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ లో థియేటర్లలోకి వస్తోంది ఓజీ మూవీ.

First Published:  5 Aug 2023 8:51 AM
Next Story