Pawan Kalyan - వచ్చే నెల నుంచి ఒకేసారి 2 సినిమాలు
Pawan Kalyan - వచ్చే నెల నుంచి ఒకేసారి రెండు సినిమాల్ని స్టార్ట్ చేయబోతున్నాడు పవన్. ఆ మూవీస్ డీటైల్స్ చెక్ చేద్దాం

Pawan Kalyan: విమానంలో పవన్ కల్యాణ్ కు అవమానం
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే, మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ శితం రీమేక్ లో నటిస్తున్నాడు. వీటిలో వినోదాయశితం రీమేక్ కు సంబంధించి పవన్ పార్ట్ కంప్లీట్ అయింది. అటు హరిహర వీరమల్లు సినిమా ఎలాగూ నడుస్తూనే ఉంటుంది.
కాబట్టి వచ్చే నెల నుంచి మరో 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు పవన్. అవే సుజీత్, హరీశ్ శంకర్ సినిమాలు. సుజీత్ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు పవన్. ఆ వెంటనే 10 రోజుల గ్యాప్ లో హరీశ్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇన్నాళ్లూ పవన్ సినిమా షూటింగులు హైదరాబాద్ లోనే జరిగాయి. హైదరాబాద్ దాటి బయటకు వెళ్లడానికి పవన్ ఇష్టపడలేదు. ఎందుకంటే, అతడు రాజకీయాలు కూడా చేస్తున్నాడు కాబట్టి. కానీ ఈసారి ముంబయి షెడ్యూల్ ఫిక్స్ అయ్యేలా ఉంది.
సుజీత్ సినిమా కోసం పవన్ కల్యాణ్ ముంబయి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ముంబయిలో లొకేషన్ వేట కూడా పూర్తయింది. మొత్తమ్మీద ఏప్రిల్ నెలలో సుజీత్, హరీశ్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండబోతున్నాడు పవన్.